Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 ఆప్తల్మిక్ ఎక్విప్మెంట్ కూడా
- ఏర్పాట్లకు అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 56 టిఫా స్కానింగ్ యంత్రాలతో పాటు 26 ఆప్తల్మిక్ పరికరాలను (కంటి చికిత్సకు వినియోగించే ఆపరేటింగ్ మైక్రో స్కోప్‌లు) ఈ నెల 18న ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో టీఎస్ఎంఐడీసీ, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కొనసాగుతున్న పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించిన మంత్రి, డీఎంఈ, టీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో సివిల్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. గర్భిణీ లు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వాస్పత్రు ల్లో టిఫా స్కానింగ్ యంత్రాలను తీసుకొస్తున్నట్టు తెలిపారు. గాంధీ, నిమ్స్, జహీరాబాద్, హుస్నాబాద్, మల్కాజ్ గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీవీవీపీ పరిధిలోని 32 ఆసుపత్రుల అప్ గ్రేడే షన్ పనులు, 13 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయా గస్టిక్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 41 బస్తీ దవాఖానల నిర్మాణాలను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలన్నారు. సమీక్షలో టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
చెల్లింపులపై ఆందోళనొద్దు...
ఆరోగ్యశ్రీ పరిధిలో క్యాన్సర్ చికిత్సలు చేయాలి
చెల్లింపులపై ఎలాంటి ఆందోళన చెందొద్దనీ, ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు ఆస్పత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలను ఎక్కువగా ఆరోగ్యశ్రీ పరిధిలో చేయాలని సూచించారు. తద్వారా వారికి నాణ్యమైన వైద్యమందించాలని కోరారు. ప్రజా వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.11,440 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఒకే రోజున రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించు కోబోతున్నామనీ, వీటితో కలుపుకుని ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరుకుంటుందని వివరించారు. ఇప్పటికే ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో క్యాథ్ ల్యాబ్‌లు ప్రారంభించామనీ, మహబూబ్ నగర్, సిద్ధిపేట జిల్లాల్లో త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం మొదలైందని తెలిపారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను విస్తరిస్తామని జరుగుతున్నదని చెప్పారు. కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రులు మానవత్వంతో, ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని కోరారు.