Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాసిజం దేశానికి ప్రమాదం
- ఐక్య పోరాటాల అవశ్యకత పెరిగింది :ఎంసీపీఐ(యు) సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతం మాటున బీజేపీ దేశంలో ఉన్మాదాన్ని ప్రేరేపిస్తు న్నదని పలు కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.ఎంసీపీఐ(యు) జాతీయ ఐదో మహాసభలు బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో ఈ నెల 12నుంచి 15వరకు జరగ నున్న నేపథ్యంలో ' బీజేపీ మతోన్మాద ఫాసిస్టు విధానాలు- వామపక్ష శక్తుల కర్తవ్యం' అంశంపై సోమవారం హైదరా బాద్‌లోని ఓంకార్ భవన్లో సెమినార్ నిర్వహించారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుకన్య అధ్యక్ష త వహించారు.
ఈ సందర్భంగా ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం గా పాలన సాగిస్తున్నదని చెప్పారు. ప్రశ్నించిన ప్రతి వాళ్లను ఉపా, రాజద్రోహం, దేశ ద్రోహం,అర్బన్ నక్సల్స్ పేరుతో జైల్లో పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలపై రకరకాల సాకులతో దాడులు చేస్తోందన్నారు. మనువాద విధానాలను అమలు చేస్తు న్నదని చెప్పారు. సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజరు కుమార్ మాట్లాడు తూ.. కాషాయీ కరణతో బీజేపీ దేశంలో బలపడిందని చె ప్పారు. మత విధ్వంసాన్ని సాగిస్తున్నదని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఐక్య ఉద్యమాలు చేప ట్టాలని పిలుపునిచ్చారు. ఎస్‌యుసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురాహరి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో నియ ంతృత్వాన్ని కార్మికా, ప్రజా పోరాటాలు నిలవరించాయని చెప్పారు. అదే తరహాలో మన దేశంలో బీజేపీ ఫాసిజాన్ని ఐక్య ఉద్యమాలతో తిప్పికొట్టాలన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలపతి రావు, సీపీఐ(ఎంఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి సైదయ్య, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వన ం సుధాకర్, వి తుకారాం నాయ క్, రాష్ట్ర కమిటీ స భ్యులు తాండ్ర కళావతి, పల్లె ము రళి,ఈ. కిష్టయ్య పాల్గొన్నారు.