Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం
- ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో వ్యవసాయరంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ విమర్శించారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరా బాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజూ కృష్ణన్ మాట్లాడుతూ మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల ఐక్య పోరాటం చారిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. ఈ పోరాటం లో ఏఐకేఎస్ కీలక పాత్ర పోషించింద న్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ఎన్నికల ముందు మోడీ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆచరణలో వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే చర్యలే తీసుకుంటున్నారని విమర్శిం చారు. మోడీ పాలనలో రైతుల ఆదాయం అసంఘటిత రంగకార్మికుల కంటే గణనీయంగా తగ్గిందన్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని కప్పిపుచ్చేందుకు రైతుల ఆత్మహత్యలను దాస్తున్నారని చెప్పారు. ఎన్ఎస్ఎస్ సర్వేలో వ్యవసాయ ఆదాయాన్ని పంటలు, పాడి, వ్యవ సాయ కూలీల ఆదాయం ఆధారంగా లెక్కిస్తారని వివరించారు. ప్రస్తుతం వ్యవసాయ కార్మికుల వేతనాలు పెరిగాయనీ, పాడిద్వారా వచ్చే ఆదా యం కూడా పెరిగిందని అన్నా రు. అయితే పంటలను పండించడం ద్వారా రైతుకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు మోడీ తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామంటూ వాగ్దానం చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడం సాధ్యంకాదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారని విమర్శించారు. కోవిడ్‌తో అన్ని వర్గాల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోతే అంబానీ, ఆదానీల ఆదాయం మాత్రం పెరిగిందని చెప్పారు. తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 2006 అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచేందుకు పూనుకున్నదని అన్నారు. గ్రామ సభలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదపై హక్కులు కల్పించేందుకు పూనుకుంటు న్నదని చెప్పారు. చట్టం ప్రకారం షెడ్యూల్ ఏరియాలోనే కాకుండా అటవీ భూములు క్కడున్నా గిరిజను లు, గిరిజనేతరులందరికీ హక్కు పత్రా లివ్వాలని కోరారు. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం అర్హులైన పేదలకు హక్కు పత్రాలివ్వకుండా బలవంతంగా రైతుల నుంచి భూము లను గుంజుకునేందుకు ప్రయత్నిస్తు న్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, బొంతల చంద్రారెడ్డి, పి జంగారెడ్డి, మాదినేని రమేష్, నున్నా నాగేశ్వరరావు, మల్లు నాగార్జునరెడ్డి, కున్సోత్ ధర్మా, వర్ణ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, జి జయరాజు, మోకు కనక రెడ్డి, శెట్టి వెంకన్న, పల్లపు వెంకటేశ్, డి బాల్‌రెడ్డి, ఎం. శ్రీనివాసులు, దండ వెంకట్‌రెడ్డి, ఎస్ భాగ్యలక్ష్మి, కందాల ప్రమీల, రజిత తదితరులు పాల్గొన్నారు.