Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన వల్లే పార్టీ డ్యామేజ్ : పాల్వాయి స్రవంతి
నవతెలంగాణ -చండూర్
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేశారని పాల్వాయి స్రవంతి రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడి కూడా గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్ట్ రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ధనబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. ప్రలోభాలకు, భయాందోళనకు గురిచేయడం వల్ల ఓటర్లకు ఇబ్బంది కలిగిందన్నారు. తమ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు టర్న్ అయిందన్నారు. త్వరలో హైకమాండ్ వెంకట్‌రెడ్డిపై చర్యలు చూసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఇంత అనైతిక రాజకీయాలను తానెప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు చూశాక రాజకీయాలు చేయాలంటేనే భయమేస్తుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, పన్నాల లింగయ్య, మంచు కొండ సంజరు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.