Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారుణంగా దెబ్బతీసిన పెద్ద నోట్ల రద్దు
- ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా పతనం కావటానికి ప్రధాని మోడీయే కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయమనేది ప్రజల్ని దారుణంగా దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేల కంపెనీలు మూతబడ్డాయనీ, నిరుద్యోగం పెచ్చరిల్లిందని తెలిపారు. ఆ నిర్ణయానికి ఆరేండ్లయిన సందర్భంగా సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నోట్ల రద్దు తర్వాత కొత్తగా మరో 12.91 లక్షల కోట్ల నగదు చలామణిలోకి వ చ్చిందని తెలిపారు. చరిత్రలో ఎన్న డూ లేని విధంగా రికార్డు స్థాయిలో 30.88 లక్షల కోట్లకు ఆ చలామణి పెరిగిందని వివరించారు. నోట్ల రద్దు వల్ల ప్రభుత్వాలకు పన్ను రాబ డి సైతం తగ్గి.. సంక్షేమ కార్యక్ర మాల అమలుకు తీరని విఘాతం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దేశ ప్రజలకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని ప్రధాని మోడీని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వా నికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా దారు ణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ను ఇప్పటికైనా గాడిలో పెట్టాలని ఆయన కోరారు. అందుకనుగుణం గా అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.