Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గవర్నర్, టీఆర్ఎస్ రాజకీయాల వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతున్నదని బీఎస్పీ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయటంలో ఇరువురికి చిత్తశుద్ది లేదని పేర్కొన్నారు. బీజేపీ దేశంలో అనాగరిక, దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయిందని తెలిపారు. మునుగోడులో టిఆర్ఎస్ రూ. 500 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా గెలవలేకనే కమ్యూనిస్టులను కలుపుకున్నారన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు డబ్బు, మద్యం పంపిణీలో టీఆర్ఎస్,బీజేపీి పోటీపడ్డాయని విమర్శించారు.ఎన్నికల కమిషన్ వీటిని నిరోధించటంలో విఫలమైందని తెలిపారు.