Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగదు బదిలీ చేయాలి :జీఎంపీఎస్ డిమాండ్
నవతెలగాణబ్యూరో -హైదరాబాద్
గొర్రెల పంపిణీకి సంబంధించి నగదు బదిలీ చేయకుండా పాత పద్ధతిలోనే వాటిని పంపిణీ చేస్తామంటే ప్రభుత్వం గొల్లకురుమల ఆగ్రహానికి గురికాక తప్పదని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మునుగోడు ఎన్నికతోపాటే గొర్రెల పంపిణీకి నగదు బదిలీ పథకం కూడా ముగిసినట్టేననీ, మళ్లీ పాత పద్ధతిలోనే గొర్రెలు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ వార్తలొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గొల్లకురుమల అభివృద్ధి పేరుతో తెచ్చిన పథకం వారికి ఉపయోగపడేలా చేస్తారా? లేదంటే గతంలో మాదిరిగా మధ్య దళారీలకు, కొంతమంది పశువైద్యాధికారులకు కొంతమంది నాయకులకే లబ్ది చేకూరుస్తారా? అని ప్రశ్నించారు. వెంటనే మంత్రి కేటీఆర్ ఇతర మంత్రులు స్పందించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గొల్లకురుమలను చైతన్యం చేసి ఉద్యమాన్ని చేపడుతామనీ, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.