Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
నేరేడుచర్ల మండలంలోని జానపాడు రోడ్ లోని రాఘవేంద్ర ఫార్ బైల్డ్ రైస్ మిల్ కు ఆరుగాలం పండించిన పంటను అమ్ముటకు రైతులు ధాన్యాన్ని టాక్టర్లను తరలించారు. వే బ్రిడ్జి కాంటాలో పెట్టగా ట్రాక్టర్ కి 10 క్వింటాల ధాన్యం తేడా ఉన్నట్లు రైతులు గమనించి మిల్లర్లను ప్రశ్నించగా వారు కంప్యూటర్ల వైర్లు ప్రాబ్లం ఉన్నందున ఇలా జరిగిందని తెలిపారు. దీనిపై రైతులు నేరేడుచర్ల జానపాడు రోడ్ లో ధర్నాకు దిగారు. రైతులు సంబంధిత పోలీసులకు కబురు చేయగా హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి ఎస్సై నవీన్ కుమార్ వారి సిబ్బందితో అక్కడికి వచ్చారు. అక్కడున్న రైతులతో మాట్లాడి విషయాలు తెలుసుకొని అక్కడ ఉన్న కంప్యూటర్లను పరిశీలించి తదుపరి చర్యలు కై రైతుల ద్వారా ఫిర్యాదు స్వీకరించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.