Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఆ మహాసభ చైర్మన్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఆవిష్కరించారు. ప్రతి గ్రామం, పట్టణం, జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో ముదిరాజ్ మహాసభ జెండాలను ఎగురవేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. 66 సంవత్సరాల కాలంలో ఏనాడూ లేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఎనిమిదేండ్ల కాలంలోనే ముదిరాజులకు లభించాయని వారు పేర్కొన్నారు.