Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని పర్యటన నేపథ్యంలో...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనను పురస్కరించుకొని సికింద్రాబాద్-రామగుండం రైలు మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు. మంగళవారంనాడాయన సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక రైలులో ఈ మార్గాన్ని తనిఖీ చేశారు. ట్రాక్ భద్రతా అంశాలు, వేగ సామర్ధ్యం, వేగ పరిమితి తదితర విషయాలను సమీక్షించారు. రామగుండం రైల్వేస్టేషన్‌ను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలు, ఇతర అభివద్ధిపై అధికారులతో చర్చించారు. స్టేషన్‌మాస్టర్ కార్యాలయంలో రైళ్ల రాకపోకలకు సంబందించిన అంశాలను పరిశీలించారు. రామగుండం రైల్వేస్టేషన్లో తణధాన్యాలు, ఆహార పదార్ధాల విక్రయాల కోసం ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ -వన్ ప్రోడక్ట్ స్టాల్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణమంతా కలియతిరిగి పలు సూచనలు చేశారు. అనంతరం రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. అటునుంచి రామగుండంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రైల్వే లైన్, ఇతర సైడింగ్ పనులను పరిశీలించారు. సరకు రవాణా, అభివద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.