Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు ట్రెసా బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనీ, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) బృందం మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేసింది. ట్రెసా రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షులు వంగ రవీం దర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ముసరాంబాగ్ రెవెన్యూ భవన్ లో జరిగింది. రెవెన్యూ శాఖలో విధులను, పని బారాన్ని బట్టి నూతన కేడర్ స్ట్రెంగ్త్ నిర్వహణ, జూనియర్ అసిస్టెంట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు వివిధ కేడర్ల పదోన్నతులు, పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు, ధరణికి సంబంధించిన అంశాలు, వీఆర్ఏలకు పే స్కేలు వంటి పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లాలని నిర్ణయించారు. అనంతరం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ రెండు రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు తగు చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ తో పాటు అసోసి యేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పి.రాజ్ కుమార్, ఎల్.పూల్ సింగ్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి,సిఎల్‌బి శాస్త్రి,డి. మధుసూదన్, క.నిరం జన్, కార్యదర్శులు సయ్యద్ మౌలానా,కె. వెంకట్ రెడ్డి, మనోహర్ చక్ర వర్తి, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి,చిల్లా శ్రీనివాస్,గుర్రం శ్రీనివాస్, ఆర్గనైసింగ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి శ్రవణ్, సభ్యులు నిర్మల, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.