Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ వైద్యాన్ని ప్రోత్సహిస్తున్న... డాక్టర్ పీ.ఎస్.మురళీకృష్ణపై చర్యలు తీసుకోండి: టీఎస్ఎంసీకి హెచ్ఆర్డీఏ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన వ్యాపార ప్రచారం కోసం నకిలీలను ప్రోత్సహిస్తున్న కొత్తగూడెం శ్రీరామ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యంతో పాటు అందులో పని చేస్తున్న డాక్టర్ పీ.ఎస్.మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) చైర్మెన్‌కు హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. టీఎస్ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్, వైద్య విలువల ప్రవర్తన, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ప్రొఫెషనల్ కండక్ట్, ఎటిక్వెట్ అండ్ ఎథిక్స్) రెగ్యులేషన్, 2022 చట్టాలను సదరు డాక్టరు ఉల్లంఘించినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు తాము డాక్టర్లుగా చెప్పుకుంటూ... నకిలీలకు ఆ డాక్టరు శిక్షణ ఇవ్వనున్నట్టు కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కరపత్రాలు పంపిణీ అవుతున్నాయని తెలిపారు.ఇది ఎన్ ఎంసీ యాక్ట్ 2019, మెడికల్ ఎథిక్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. కరపత్రంలోని వివరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ, ఆ కరపత్రాలను ఫిర్యాదుతో పాటు జత చేశారు.