Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అభివృద్ధ్ది పనులు కేవలం మునుగోడు నియోజక వర్గానికేనా? రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాల అభివృద్ధి పట్టదా? అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. మునుగోడులో ఎన్నికల హామీలు వెంటనే ఆచరణలో పెట్టాలనీ, అవి అమలు చేయడానికి పంచాయత్రాజ్, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, గిరిజన శాఖల మంత్రులు మునుగోడుకు వెళ్లాలని చెప్పడం, జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాని చెప్పడం దేనికి సంకేతామని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలు మరిచారా? వాటిని అమలు చేసే బాధ్యత లేదా? అని గుర్తు చేశారు.