Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవటంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాం నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణం వల్లే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడిపల్లికి చెందిన ఎట్టి మల్లయ్య కూతురు కన్నుమూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.