Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాం కాలేజీ ఘటనపై మంత్రి సబితకు కేటీఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినుల హాస్టల్ అలాట్మెంట్ సమస్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్తినులకు భరోసా ఇచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ భవనాన్ని నిర్మించి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని పేర్కొన్నారు. సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఆయన సూచించారు.