Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ పర్యాటకుల భూతల స్వర్గంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్ట్ (డబ్ల్యూటీఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ (ఏబీటీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియా టూరిజం కార్యదర్శి అరవింద్ సింగ్ తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపుతో పాటు పోచంపల్లి ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. కోవిడ్ తర్వాత ప్రపంచ పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందన్నారు.