Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిక్కు మత గురువులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురునానక్ ప్రబోధించిన శాంతి, సామాజిక సామరస్యత బోధనలు నేటి సమాజానికి అనుసరణీయాలని పలువురు సిక్కు మతగురువులు పేర్కొన్నారు. మంగళవారం గురునానక్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కెనడా, పంజాబ్ నుంచి వచ్చిన మతగురువులు (రాగిజాతాలు) భారు సత్నామ్ సింగ్ (శ్రీ దర్బార్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్, అమ్రిత్ సర్), భాయి సరబ్ జిత్ సింగ్ (పాట్నా), హుజురీ, భాయి హరి సింగ్, భాయి చరణ్ జిత్ సింగ్, భారు జగ్దేవ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక కీర్తలను ఆలపించారు. ఈ సందర్భంగా మనుష్యులంతా సమానమనే సందేశమిచ్చేలా ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాన్ని 25 వేల మందికి పైగా స్వీకరించారు. వైద్య శిబిరం తదితర సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రబంధక్ కమిటీ కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్ గులాటీ, నాయకులు ఎస్. బల్దేవ్ సింగ్ బగ్గా, ఎస్.కుల్దీప్ సింగ్ బగ్గా, ఎస్.జగ్ మోహన్ సింగ్, ఎస్.ఇందర్ జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.