Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు పీఆర్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయాలని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేండ్లుగా పదోన్నతులు, సాధారణ బదిలీల్లేక ఉపాధ్యాయులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.