Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య కోసం పనిచేశారు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు జంగయ్య, చావ రవి
- దౌల్తాబాద్‌లో బందెప్ప, నాణ్యనాయక్ల సంస్మరణ సభ
నవతెలంగాణ- కొడంగల్
టీఎస్‌యూటీఎఫ్ నిర్మాణంలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప, దౌల్తాబాద్ మండల అధ్యక్షులు నాణ్య నాయక్ క్రియాశీలకంగా పనిచేశారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు జంగయ్య, చావ రవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాదకులు మాణిక్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం అధ్యక్షతన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బందెప్ప, నాణ్యనాయక్ మంగళవారం సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బందెప్ప, నాణ్య నాయక్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. సీపీఎస్ రద్దుతో ఉపాధ్యాయులకే కాక ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు అందరికీ అన్యాయం జరుగుతుందన్నారు. సీపీఎస్‌ను మళ్లీ పునరిద్దేందుకు నిర్వహించిన ఉద్యమంలో జిల్లాలో ఉద్యోగులను ఐక్యం చేయడానికి బందెప్ప, నాణ్య నాయక్ కృషి చేశారని గుర్తుచేశారు. కు సంబంధించి మాత్రమే కాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసీ, విమానశ్రయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు అమ్మేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు పనిచేసే సంఘమే టీఎస్‌యూటీఎఫ్ అన్నారు. ప్రభుత్వ బడిలో చదువుకుంటేనే సమాజం అర్థమవుతుం దన్నారు. ఇతర దేశాల్లో విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు, కులమత బేధాలతో బడులు ఉండకూడదని కోరుకున్న వ్యక్తులు బందెప్ప, నాణ్య నాయక్ అని అన్నారు. ఎమ్మెల్సీగా మాణిక్ రెడ్డిని గెలిపించుకోవాలన్న వారి చివరి మాటల కోసం ఉపాధ్యాయులం కష్టపడి పనిచేయాలని తెలిపారు. మాణిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి వారికి నివాళి అర్పిద్దామన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పిలుపిస్తే.. 2,300 మంది ఉపాధ్యాయులు స్పందించి రూ.200 నుంచి రూ.10వేల వరకు విరాళాలు ఇచ్చారన్నారు. నాణ్యనాయక్ కుటుంబానికి రూ.7.50లక్షలు, బందెప్ప ముగ్గురు కుమారులకు రూ.10.50 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్, దౌల్తాబాద్ మండల జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజరు కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ నరోత్తంరెడ్డి, సర్పంచ్ శిరీష రమేష్, టీఎస్‌యూటీఎఫ్ వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య, బందెప్ప, నాణ్యనాయక్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.