Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనకయ్య ప్రధమ వర్థంతిలో వక్తలు
హైదరాబాద్ : సున్నిత మనస్కులు, నిరాడంబరుడు గండ్రత్ కనకయ్య (బీజేపీ, గొల్నాక డివిజన్ ప్రధాన కార్యదర్శి) మన నుంచి దూరమై అప్పుడే సంవత్సరం కాలం ముగిసింది. వారితో గడిపిన క్షణాలు ఇప్పటికి మన వెన్నంటే ఉన్నాయి. కనకయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమం ఖాద్రిబాగ్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు , జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జీ బి. వెంకట రెడ్డి , నల్లకుంట కార్పొరేటర్ వై. అమృత , సీనియర్ నాయకులు.కృష్ణ గౌడ్ , కన్నె రమేష్ యాదవ్ , ఎక్కాల నందు , వినోద్ యాదవ్ , ఈ. అజరు కుమార్ , జి. ఆనంద్ గౌడ్ , బుచ్చి రెడ్డి , కత్తుల సుదర్శన్ ,.శ్యామ్ రాజ్ , సంతోష్ , నర్సింగ్ రావు యాదవ్ , ఆర్ వి ఎల్ రమేష్,. శ్రీధర్ గౌడ్, కె. రవీందర్, బి. ఈశ్వరరావు, కే. సునీల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎం. రాజులు , కుటుంబ సభ్యులు జి. వంశీకృష్ణ, శంకర్ , తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.