Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఎస్. వీరయ్య, పుప్పాల శ్రీకాంత్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేటు రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా ఎస్.వీరయ్య, పుప్పాల శ్రీకాంత్ ఎన్నికయ్యారు. యూనియన్ రాష్ట్ర 3వ మహాసభలు ఖమ్మంలోని సుదగాని లక్ష్మీ నారా యణనగర్, శ్యామల్ చక్రవర్తి ప్రాంగణం (మంచి కంటిహాల్)లో జరిగాయి. మహాసభల ముగింపు సం దర్భంగా 53మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్ను కున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎస్.వీరయ్య (రాష్ట్ర కేంద్రం), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పుప్పాల శ్రీకాంత్ (రాష్ట్ర కేంద్రం), కోశాధికారిగా కె.సతీష్ (హైదరా బాద్), ఉపాధ్యక్షులుగా వీఎస్.రావు (రాష్ట్ర కేంద్రం), జె.ఉపేందర్ (ఖమ్మం), మహబూబ్ పాష (వరం గల్), జి.ప్రభాకర్‌రెడ్డి (హన్మకొండ), కె.అజబ్బాబు (హైదరాబాద్ సెంట్రల్ సిటీ), జి.సాయిలు (సంగా రెడ్డి), టి. విష్ణు (ఖమ్మం), జె.రుద్రకుమార్ (రంగా రెడ్డి), ఎండీ. షా (భువనగిరి), కో-ఆప్షన్ (నిజామా బాద్), కార్యదర్శులుగా కల్లూరి మల్లేశం (భువనగిరి), పున్నం రవి (కరీంనగర్), లక్ష్మీనారాయణ (నల్లగొండ ), కె.యాదగిరిరావు (సూర్యాపేట), వై.విక్రమ్ (ఖమ్మం), సుంచు విజేందర్ (జనగామ), చొప్పరి రవికుమార్ (సిద్దిపేట), ఎల్. కోటయ్య (హైదరాబాద్ సౌత్), రామయ్య (నాగర్ కర్నూల్), ఎస్, రాము (వనపర్తి)తో పాటు 34 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
సంక్షేమ బోర్డు ఏర్పాటుకు డిమాండ్..
రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉన్న ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని మహాసభ అభిప్రాయ పడింది. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా లేదని, పని గంటలు, కనీస వేతనాలు లేక కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సంక్షేమ చట్టం ఏర్పాటు చేసి, ప్రభుత్వమే కార్మికుల సబ్సిడీ ద్వారా వాహనాలు కొనుగోలు చేసి ఇవ్వాలని మహాసభ తీర్మానం చేసింది. పట్టణ, మండల కేంద్రాల్లో ఆటోలు నిలుపుకోడానికి అడ్డాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. వీటితో పాటు ఇంకా పలు తీర్మానాలను చేశారు.
తీర్మానాలు..
యాదాద్రి గుట్ట పైకి ఆటోలను అనుమతించాలి, వి.వి. గిరి నేషనల్ ఇన్స్టిట్యూట్ సూచనలు అమలు చెయ్యాలి, రోడ్డు రవాణారంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఎంవీ యాక్టు బిల్లును ఉపసంహరించుకోవాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉసంహరించుకోవాలి, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి. ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి. యూనియన్లను పునరుద్ధరించాలి. ఆర్టీసీని రక్షించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించి, కొత్త బస్సులు కొనాలని మహాసభలో తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.