Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
కేంద్ర సాయుధ పోలీసు బలగాలైన బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీఎఫ్, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్ వంటి విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కే అలోక్‌కుమార్ సూచించారు. ఈ మేరకు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ఫోర్సుల్లో 24,369 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందనీ, దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 30 వరకు గడువు ఉందని తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్దపడే అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.