Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యాదగిరిగుట్ట
యువతీ యువకుడు ప్రేమించుకున్నారు.. కానీ ఆమెకు కుటుంబీ కులు మరొకరితో పెండ్లి చేశారు.. ప్రేమను మరిచిపోలేక ప్రియుడు, వివాహిత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల పరిధిలోని బాహుపేట గ్రామ పరిధిలో జరిగింది. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఉడుతల గణేష్ (25), నలంద (23) ప్రేమించుకున్నారు. వారి పెండ్లికి పెద్దలు అడ్డుపడ్డారు. మూడేండ్ల కిందట నలందకు యాదగిరిగిట్టకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, గణేష్, నలంద తమ ప్రేమను మరిచిపోలేకపోయారు. దాంతో ఇద్దరూ మంగళవారం ఇండ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చేసరికి నలందం ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 2.30 సమయంలో గణేష్, నలంద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించి మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించారు.