Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైస్ ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు చింతల రమేష్‌పై వైస్ ఎంపీపీ గుత్తా రవి చెప్పుతో దాడికి పాల్పడటాన్ని ఆ సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రవిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో అనేక రకాల ప్రజా సమస్యలపై విద్యా ర్థులు, యువకులు పోరాడుతున్నారని తెలిపారు. ఆ పోరాటంలో ఉన్న డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి,రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ సమస్యలపై ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక అహంకా రంతో రఘునాధపాలెం మండల వైస్ ఎంపీపీ గుత్తా రవి చెప్పుతో దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఆయనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై మాట్లాడటాన్ని ఓర్వలేక దాడికి పాల్పడ్డారని తెలిపారు. అధికార పార్టీ అండదండలతో స్థానిక వైస్ ఎంపీపీ ప్రజా సమస్యలపై నిలదీసిన వారిపై భౌతిక దాడికి పాల్పడటం సరైంది కాదని పేర్కొన్నారు.