Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ ఆకస్మికంగా నోట్లు రద్దు నిర్ణయం అనాలోచిత చర్య అని ఈ ఆరేండ్లలో రుజువైందని టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ ఎద్దేవా చేశారు. నోట్లను రద్దు చేసి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నోట్ల రద్దుతో కేంద్రం ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా దేశానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందనీ, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని పేర్కొన్నారు. చిరువ్యాపారులకు బాగా నష్టపోయారనీ, అనేక రంగారల్లో యువత కొలువులు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. బ్యాంకుల్లో రుణం తీసుకుని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు ఇతర దేశాల్లో దర్జాగా ఎంజారు చేస్తున్నారని విమర్శించారు. ఆయిల్, బంగారం, రియల్ ఎస్టేట్, టెలికాం, ఫార్మా, వినోదం, క్రీడా, వాణిజ్య, వ్యాపార రంగాల్లో భారీగా నల్లధనం చేతులు మారిందని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల ఏం సాధించారనేది ఈ దేశానికి చెప్పాల్సిన అవసరముందని ఆయన డిమాండ్ చేశారు.