Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పీడీ యాక్ట్ కేసులో అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు చెప్పింది. సుమారు రెండు నెలలుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనను విడుదల చేయాలని బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీ చేసింది. 'జైలు నుంచి విడుదలయ్యేప్పుడు జనం గుమికూడకూడదు. భార్య, కుటుంబసభ్యులు, న్యాయవాది మొత్తం ఆరుగురు ఉండాలి. మతపరంగా ఏవిధమైన విద్వేషపూరిత ప్రకటనలు చేయకూడదు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు' అని షరతులు పెట్టింది. రాజాసింగ్‌పై నమోదైన క్రైం నంబర్ 261/2022లో ఉన్న ఆంక్షలన్నీ అమల్లో ఉంటాయి. కింది కోర్టు విధించిన ఆక్షలు అమల్లోనే ఉంటాయి. రూ.25 వేలు షఉరిటీ ఇవ్వాలి. రాజాసింగ్‌పై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చెల్లదు.. అని చెప్పింది. పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య టి.ఉషాభాయి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదించారు. 'రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విద్వేషపూరిత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఒక హత్య కేసు కూడా ఉంది. మంగళ్‌హాట్ పీఎస్‌లో ఇప్పటికీ రౌడీషీట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసింది. పీడీ యాక్ట్ నమోదు కేసులో 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జీవో 90ని జారీ చేసింది. రిట్‌ను కొట్టేయాలి' అని ఏజీ వాదించారు. పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలని ఉషాభారు తరఫు న్యాయవాది రవిచందర్ వాదనను హైకోర్టు ఆమోదించింది. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగం చెల్లదని తేల్చింది.