Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహెడ మార్కెట్ : మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా కోహెడ మార్కెట్‌ను నిర్మించబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. 199.13 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల సము దాయంలో ఇదే అం శంపై ఉన్న తాధిక ారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ఆహ్వానం మేరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్ బోర్డు ఎండీ జగ్వీర్ సింగ్ యాదవ్ పలు సూచనలు చేసినట్టు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, ఎస్ఈ రాధా కష్ణమూర్తి, కన్సల్టెంట్ ఉమా మహేశ్వరరావు, ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మ హర్ష, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ చిలుక నర్సింహారెడ్డి, డీఈఈ రవీందర్ తదితరులు ఉన్నారు.