Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ హయంలో ప్రమాదకర స్థితుల్లోకి దేశం
- మునుగోడులో టీఆర్ఎస్ది సాంకేతిక విజయం
- కమ్యూనిస్టుల సహకారంతోనే కారు పరుగు
- గవర్నర్ అనుమానాలను సర్కారు నివృత్తి చేయాలి
- బీజేపీ, టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ హయాంలో దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టబడిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నూతన శకానికి నాంది పలికిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు యాత్రను అక్కున చేర్చుకున్నారని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు ఆయన తెలిపారు. మునుగోడులో కమ్యూనిస్టుల సహకారంతో కారు పరుగులు పెట్టిందనీ, అది సాంకేతిక విజయం మాత్రమేనని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సందర్భమని చెప్పారు. 'పీసీసీ అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించాను. ప్రజల్లో భరోసాను నింపేందుకు, జోడో యాత్ర స్ఫూర్తితో మళ్లీ ప్రజల ముందుకొస్తాం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన కార్యాచరణతో ప్రజల్లోకి వెళుతుంది' అని చెప్పారు. టీఆర్ెఎస్, బీజేపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు సరైన ప్రణాళికతో ముందు కొస్తామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలవదనే భయంతోనే కేసీఆర్ కమ్యూనిస్టుల సహకారం తీసుకున్నారని చెప్పారు. ఆ పార్టీ పరాన్న జీవిగా మారిందన్నారు. పరాయి వ్యక్తులు, శక్తులపై ఆధారపడి టీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. మునుగోడులో బీజేపీ వందల కోట్లు పంచిపెట్టి దేశంలోనే తాగుబోతు నియజకవర్గంగా మార్చిందన్నారు. 20రోజుల్లో 300 కోట్ల రూపా యల మందును తాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజలను తాగుబోతులుగా మార్చాయంటే, అక్కడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. చుక్క మందు కూడా పోయకుండా కాంగ్రెస్‌పార్టీ 24 వేల ఓట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు. తమ పార్టీని మూడో స్థానానికి నెట్టడానికి చాలా మంది బీజేపీ నాయకులు తిష్ట వేశారని చెప్పారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉందా?అని ప్రశ్నించారు. వేల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చి అభ్యర్థిని కొనుక్కున్న మోడీకి సామాజిక స్పృహ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం అయిందంటూ ప్రధాని ప్రకటించడం దిగజారుడుకు తననానికి పరాకాష్ట అని విమర్శించారు. మునుగోడులో ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో కాంగ్రెస్‌పై ప్రజల్లో మమకారం తగ్గలేదనే విషయం అర్ధమైందన్నారు. 'ఆ ఫలితాలపై నేను సంతప్తిగా ఉన్నా మా కార్యకర్తల పోరాట పటిమను నేను అభినందిస్తున్నా. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తదుపరి కార్యచరణ ఉంటుంది' అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాదనీ, ఏఐసీసీ ఆదేశాల ప్రకారం టీపీసీసీ నడుచుకుంటుందన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే గవర్నర్‌తో టీఆర్ఎస్ పంచాయతీ పెట్టుకుంటు కున్నదని తెలిపారు. గవర్నర్ సందేహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో తమకు సహజ మిత్రులు అనీ, కాంగ్రెస్‌తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈడబ్ల్యూసీ కోటాను నిర్ణయించాలి
సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో ఈడబ్ల్యూసీ కోటాను వెంటనే నిర్ణయిం చాలని రేవంత్‌రెడ్డి కోరారు. అందుకను గుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.