Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈవోకు ఎస్టీయూటీఎస్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో భారీగా బోగస్ ఓటర్లు నమోదు చేసుకుంటున్నారని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అదికారి వికాస్‌రాజ్‌ను బుధవారం ఎస్టీయూటీఎస్ అద్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నియోజకవర్గ పరిధి దాటి దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నా ఇక్కడే నివాసముంటున్నట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను చూపుతూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. దీన్ని కొన్ని సంఘాలు పనికట్టుకుని ఓటర్లుగా నమోదు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం, కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికలు 2019లో జరిగాయని గుర్తు చేశారు. అప్పుడు ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్నట్టు ధ్రువీకరణ పత్రాలతో ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అప్పటి ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని సూచించారు. బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.