Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర సీపీ సి.వి.ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు
హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణకు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేస్తు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిట్ విచారణ బృందానికి నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్‌ను నేతృత్వం వహించనున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కలిమేశ్వర్, నల్లగొండ ఎస్పీ రేమా రాజేశ్వరి, నారాయణపేట్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, శంషాబాద్ డీసీపీ జగదీఏశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మోయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డిలు సిట్ బృందంలో సభ్యులుగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, బాబూరావులను ఒక్కోక్కరిని వంద కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడానికి రామచంద్రతీర్థ స్వామి ఎలియాస్ సతీష్‌శర్మ, సింహయాజి స్వామి, నందకుమార్‌లను సైబరాబాద్ పోలీసులు వలపన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మోయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌజ్‌లో ఈ ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు, బీజేపి పార్టీ తరపున కొనుగోలు వ్యవహారం నడిచినట్టు తేల్చారు. ఈ కేసును విచారించడానికి సీబీఐకి అనుమతించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు బీజేపీ పిటీషన్‌పై విచారణను పెండింగ్‌లో ఉంచుతూ కేసు విచారణను రాష్ట్ర పోలీసులే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసు విచారణ బాధ్యతను సిట్‌కు అప్పగిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచా రించే అవకాశం ఉంది. కొనుగోలుపై చర్చలు జరుపుతున్న సమయంలో రాంచంద్రతీర్థ భారతి బీఏజీఇకి చెందిన ప్రముఖ నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపి అధ్యక్షుడు నడ్డాలతో పాటు ఆర్ఎస్ఎస్ కు చెందిన సంతోష్‌జీ, మరో బీఏజి నాయకుడు తుషార్ల పేర్లను తీసుకోవడంతో సిట్ తన విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.