Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ- మల్యాల
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని మద్దట్ల గ్రామానికి చెందిన ఓ రైతు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దట్ల గ్రామానికి చెందిన పోతాని రాయమల్లు(47) తన రెండెకరాలతో పాటు మరో కొంత భూమిని కౌలు తీసుకుని వ్యవసాయం చేశారు. పెట్టుబడితోపాటు కుటుంబ అవసరాలకు అప్పు తేవడంతో అది వడ్డీలతో కలిపి రూ.6లక్షల వరకు అయింది. పైరుకు తెగుళ్లు సోకి ధాన్యం దిగుబడి తగ్గింది. దీంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక రాయమల్లు తీవ్ర మనస్తాపం చెందాడు. మంగళవారం రాత్రి పొలం వద్ద బర్రెలకు మేత వేసేందుకని వెళ్లి తిరిగి రాలేదు. తెల్లవారిన కుటుంబ సభ్యులు వెళ్లేసరికే చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.