Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆల్ ఇండియా ఎస్బిఐ ఇంటర్ సర్కిల్ టెబుల్ టెన్నిస్ టోర్నమెంట్ బుధవారం లాంచనంగా ప్రారంభమైంది. ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో నగరంలోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో నవంబర్ 12 వరకు ఈ ఆటలు జరగనున్నాయి. కాగా.. ఈ ఆటలను ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ ఎన్డబ్ల్యు2 జీఎం దేబాసిస్ మిశ్రా లాంచనంగా ప్రారంభించారు. దేశంలోని 16 సర్కిళ్లల్లోని 160 మంది ఆగగాళ్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొంటున్నారు. స్త్రీ, పురుష విభాగాల్లో సింగిల్, డబుల్స్ కేటగిరీల్లో టెన్నిస్ పోటీలు జరగనున్నాయి. ప్రారంభోత్సవంలో పలువురు అధికారులతో పాటు బ్యాంకింగ్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.