Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వయోవృద్ధులకు సంపూర్ణ సేవలు అందించేందుకు ఏర్పాటైన 'అన్వయా నిశ్చింత్' కార్పొరేట్ సంస్థ లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ ఆకాంక్షించారు. దేశంలోనే సరికొత్త ఆలోచనతో ఈ సంస్థ ఏర్పాటైందనీ, అవసరాలకు సాంకేతికతను జోడించి సేవలు అందించడం ఈ సంస్థ ప్రత్యేకత అని చెప్పారు. బుధవారంనాడిక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ 1775 వద్ద అన్వయా నిశ్చింత్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
'అన్వయ' సంస్థ ఇప్పటికే దేశంలోని పలు పట్టణాల్లో సేవలు అందిస్తున్నదనీ, దానికి కొనసాగింపుగానే 'అన్వయా నిశ్చింత్' ఏర్పాటైందని తెలిపారు. ఒంటరిగా ఇండ్లలో నివాసం ఉండే వయో వృద్ధుల మనోల్లాసానికి అవసరమైన మానవ సంబంధాలను ఈ సంస్థ అందిస్తుందన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల శ్రమ, శ్రద్ధ, సేవాభావాన్ని అభినందించారు. సంస్థ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ 24 గంటల కేర్ కోఆర్డినేటర్లు, శిక్షణ పొందిన కేర్ మేనేజర్ల బృందం వయోవృద్ధుల సేవల కోసం అందుబాటులో ఉంటుందన్నారు. ముంబయి, హైదరాబాద్, బెంగుళూరు నగరాలు సహా 25 పట్టణాల్లో సేవలు అందిస్తున్నామనీ, 2025 నాటికి వంద పట్టణాలకు విస్తరించి, లక్షమంది సభ్యులకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
మూడు రకాల ప్యాకేజీల్లో వయో వృద్ధులకు సేవలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవసరాల రీత్యా రక్తసంబంధీకులు వయో వృద్ధులకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు, ఆ ప్రభావం వారి పనులపై పడుతుందనీ, తమ వంటి ప్రొఫెషనల్స్ అందుబాటులో ఉంటే వారి వృత్తుల్లో మరింత రాణించగలుగుతారని తెలిపారు. వృద్ధుల ఆర్థిక అంశాల్లోనూ సహాయ సహకారాలు రీయింబర్స్మెంట్ రూపంలో చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా 'అన్వయా నిశ్చింత్' వెబ్‌సైట్‌ను జయేష్‌రంజన్ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీ నటుడు, నిర్మాత సందీప్ కిషన్, అన్వయా ఎడ్వయిజరీ బోర్డు సభ్యులు శక్తిసాగర్, అన్వయా కిన్‌కేర్ ప్రయివేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు దీపికారెడ్డి, స్ట్రాటజీ అండ్ గ్రోత్ విభాగాధిపతి ప్రశాంత్ పట్కార్ తదితరులు పాల్గొన్నారు.