Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకావిష్కరణలో ఐద్వా నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐద్వా సీనియర్ నాయకులు అమ్మాజీ జీవితం అందరికీ నిరంతర స్ఫూర్తిదాయకమని ఆ సంఘం నాయకులు చెప్పారు. ఆమె జీవితంపై రచించిన పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. అల్లూరి మన్మోహిని రచించిన మానవీయ ఉద్యమకారిణి పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్లోని వీరనారి ఐలమ్మ భవన్లో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి హైమావతి ఆవిష్కరించారు. తొలిప్రతిని సీనియర్ జర్నలిస్టు ఉదయలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భ ంగా ఐద్వా సీనియర్ నాయకులు టి జ్యోతి మాట్లాడుతూ ప్రపంచంలో మానవాళి ఎదుర్కొం టున్న సమస్యలకు పరిష్కారం చూపేది కమ్యూ నిజమేనని అన్నారు. కనీస వసతుల్లేకున్నా పేదల సమస్యల పరిష్కారం కోసం అమ్మాజీ పోరాడే వారని గుర్తు చేశారు. మహిళా సంఘం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని వివరించారు. మహిళ ల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి హైమావతి మాట్లాడుతూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, ఆచార వ్యవహారాలపై అమ్మాజీ పోరాటం చేశారని అన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి అలవెన్సు కోసం కృషి చేశారని చెప్పారు. ఆమె చేసిన కృషి, పోరాటాల నుంచి ఎంతో స్ఫూర్తి పొందాలన్నారు. అమ్మాజీ... మానవ సంబంధాలను ఇప్పటికీ కొనసాగిస్తారని అన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత మాట్లాడుతూ సమస్యలపై అమ్మాజీ లోతుగా అధ్యయనం చేస్తారని చెప్పారు. ఉదయలక్ష్మి మాట్లాడుతూ ఈ పుస్తకం రాయడానికి ముందు అమ్మాజీ గురించి ఏమీ తెలియదన్నారు. ఆమె గురించి తెలుసుకోవడానికి రెండు నెలల సమయం పట్టిందన్నారు. మానవ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారని చెప్పారు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అనేక మార్పులొస్తున్నాయని అన్నారు. ఆ కాలం నాటి నేతలు తమ జీవితంలో చేసిన పోరాటాలు, మహిళా సంఘం అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని చదవాలనీ, తద్వారా ఎంతో స్ఫూర్తి పొందుతారని సూచించారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇందిర అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు భారతి, ప్రభావతి పాల్గొన్నారు.