Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎమ్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ ఉద్యోగులకు 49 శాతం పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వేతన సవరణలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. 2017 వేతన సవరణకు ముందే తమకు 16 శాతం ఐఆర్ ఉన్నదనీ, ప్రభుత్వ ఉద్యోగులతో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు సమం కావాలంటే ఐఆర్ కాకుండా మరో 33 శాతం కలిపి మొత్తం 49 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వివరించారు. ఈ మేరకు ముఖ్య మంత్రి కే చంద్రశేఖరరావుకు లేఖ రాసినట్టు తెలిపారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచలేదనే విషయాన్ని గుర్తుచేశారు. దీనితో పాటు కార్మికులకు పెండింగ్లో ఉన్న 2013 నాటి వేతన సవరణ 50 శాతం బాండు డబ్బులు, రెండు డీఏలు, సీసీఎస్ లోన్లు క్లియర్ చేయాలని కోరారు.