Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెల్త్ టెక్ స్టార్టప్ అయినా ఆయు హెల్త్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో తొలి సారిగా ప్రవేశించినట్లు ప్రకటించింది. ఈ ప్రాంతంలోని తమ ప్రస్తుత 20 హాస్పిటల్స్, 1500 పడకలకు మరిన్ని హాస్పిటల్స్‌ను జోడించనున్నట్లు తెలిపింది. గురువారం హైదరాబాద్‌లో ఆ సంస్థ కో-ఫౌండర్ హిమేష్ జోషి, సిఒఒ కరణ్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ఈ నగరంలో వచ్చే ఏడాది కాలంలో మరో 10-15 హాస్పిటళ్ళను జోడించుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. ప్రస్తుతం తమ సంస్థ ఐదు కీలక నగరాల్లో 130 హాస్పిటళ్లలో కార్యకలాపాలు కలిగి ఉందని.. వచ్చే ఏడాది కాలంలో మరో నాలుగైదు నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విజయవాడపైన దృష్టి పెట్టామన్నారు. రోగులు తమ యాప్ ద్వారా ఆయు హెల్త్ భాగస్వామ్య హాస్పిటళ్లను సందర్శించవచ్చన్నారు. అదే విధంగా కొత్తగా హాస్పిటళ్ల ఏర్పాటు, ఉన్న హాస్పిటళ్లలో నూతన విభాగాల ఏర్పాటులోనూ తాము సహకారం అందిస్తామన్నారు. అదే విధంగా భారీ రాయితీలో ఔషదాలను కల్పిస్తామన్నారు.