Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇస్రో, అటామిక్ ఎనర్జీ శాఖ సంయుక్తాధ్వ ర్యంలో ఏప్రిల్ 30 వరకు 10 బెలూన్ విమానాలను పరిశోధన కోసం వినియోగించ నున్నట్టు టాటా ఇన్ స్టిట్యూట్ ఆప్ ఫండమెంటల్ రీసర్చ్ సైంటిస్ట్ ఇన్ఛార్జ్ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల ఒకటిన ప్రారంభమైందని తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (ఈసీఐఎల్) నుంచి బెలూన్లలో హైడ్రోజన్ గ్యాస్, శాస్త్రీయ పరికరాలను నింపి పరిశోధన చేయనున్నట్టు తెలిపారు. ప్లాస్టిక్ ఫిలింలు 50 మీటర్ల నుంచి 85 మీటర్ల వరకు ఉంటాయనీ, సాధారణంగా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం 6.30 గంటల మధ్య వీటిని ప్రారంభించనున్నట్టు తెలిపారు. పరిశోధన ఆధారంగా వీటిని 30 కిలోమీటర్లు, 42 కిలోమీటర్ల ఎత్తుకు ఎగురవేయనున్నట్టు తెలిపారు. ప్రజలు పారాచూట్లను చూస్తే వాటి నుంచి పరికరాలను తొలగించవద్దని కోరారు. అలాంటి సందర్భాల్లో సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.