Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామగుండంపై పొన్నం ప్రభాకర్ ప్రధాని మోడీకి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించాలనే నిర్ణయాన్ని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ తీసుకున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంమేరకు ఆ కంపెనీకి రూ.10,000 కోట్లు కేటాయించారని తెలిపారు. మిగతా ఐదు ఎరువుల కర్మాగారాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ప్రధాని మోడీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. 1980లో దేశీయ అవసరాల నిమిత్తం 750 టన్నుల సామర్థ్యంతో మొదలు పెట్టి, అప్పటికే అందుబాటులో ఉన్న ఎన్టీపీసీ ద్వారా కరెంట్ ఉత్పత్తిని ప్రారంభించాలని తెలిపారు.