Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ పీఎస్‌లో సీట్ అధికారుల విచారణ
నవతెలంగాణ-రాజేంద్రనగర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నింది తులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్ చంచల్ గూడ జైలులో ఉన్న ముగ్గురు నిందితులను రెండ్రోజుల పోలీస్ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న మొయినాబాద్ పోలీసులు నిందితులు నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి స్వామిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. అటు నుంచి రాజేం ద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు అత్యంత సున్నితమైనది కావడం, సంచలనాత్మ కంగా మారడంతో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుందని, అనుభవజ్ఞులైన అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీజీపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సర్కారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది.