Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా తరలివచ్చిన ఆత్మీయ అభిమానులు
- 500 కార్లతో తుమ్మల కాన్వారు
- అభిమానులతో నెమరవేసుకున్న పాత జ్ఞాపకాలు
- వాజేడుపై వీడని తుమ్మల అభిమానం
నవతెలంగాణ-ములుగు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాలుగు దశాబ్దాల జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి వాజేడు మండలంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం ఏర్పాటుచేశారు. సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఆయన వెంట 500 పైగా కార్లు కాన్యాయితో తరలి రావడంతో ఆయన మార్క్ కొట్టొచ్చినట్టు కనపడింది. తుమ్మలకు ఆత్మీయ అభిమానులు ఘన స్వాగతం పలికారులతో పాటు సాలువులు కప్పి సత్కరించారు. వాజేడు మండల జడ్పీటీసీ పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద, టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య, నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ బాబు కాకర్లపూడి కళ్యాణ్ దత్తుల బాబు పూల బొకేలు అందజేసి స్వాగతించారు. వాజేడు మండల కేంద్రంలోని విశ్వనాథ ప్రసాద్‌బాబు ఇంట్లో ఏర్పాటు చేసిన విందును స్వీకరించి ఆత్మీయ అభిమానులతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా తన రాజకీయ జీవితంలో ప్రజలకు అందించిన సేవలు వివిధ మండలాలకు చేసిన అభివృద్ధి పనులను నెమరు వేసుకున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేయడంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అత్యంత ప్రీతి అయిన వాజేడు మండలాన్ని ఎప్పటికీ మరిచిపోనని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అభిమానుల కోరిక మేరకే ఆత్మీయ సమ్మేళనం వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళన సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలు నుండే కాక ఆంధ్రాలోని వీఆర్‌పురం, కూనవరం, చింతూరు తదితర మండలాల నుంచి కూడా అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తుమ్మల మార్క్ ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కొద్ది నెలలుగా ఆయనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంతగా ప్రయారిటీ ఇవ్వకపోవడంతో గుసుగా ఉన్న తుమ్మల తమ బలనిరూపణ చేసుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో పార్టీలో విభేదాలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి ఎవరూ తుమ్మల కార్యక్రమానికి వెళ్లొద్దని హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా హారైతే వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకూ రంగం సిద్ధంచేసినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది.