Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియాలో స్టాండింగ్ కమిటీకి 19 మంది నామినేషన్లు
- నేడు పరిశీలన
- 19న పోలింగ్, ఫలితాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిపాలనలో కీలకమైన స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి 10 వరకు జరిగిన నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీలోని 15 మంది సభ్యులకుగాను 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్లను శుక్రవారం పరిశీలించనున్నారు. అనంతరం అర్హత సాధించిన నామినేషన్లను అధికారులు ప్రకటిస్తారు. అయితే నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉంది. అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 3గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
ఒప్పందం ప్రకారమే
జీహెచ్ఎంసీలో ఒప్పందం ప్రకారమే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లీస్‌పార్టీ నామినేషన్లు వేశారు. అయితే 15 మంది సభ్యులకుగాను 19 మంది నామినేషన్ వేశారు. 15 మంది సభ్యుల్లో 8 మంది టీఆర్ఎస్, ఏడుగురు మజ్లీస్‌పార్టీ నుంచి ఉండే అవకాశముంది. ఆ నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకుంటే 15మంది సభ్యులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
నామినేషన్ల
వేసినవారు ఇలా..
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన వారు.. ఆర్. సునీత, రాగం నాగేందర్‌యాదవ్, బానోత్ సుజాత, పొడవు అర్చన, ఉప్పలపాటి శ్రీకాంత్, అబ్దుల్ వహీద్, సయ్యద్ సొహైల్ ఖాద్రీ, మహ్మద్ రషీద్ఫరాజుద్దీన్, మహ్మద్ అబ్దుల్ ముక్తదర్, సయ్యద్ మినాజుద్దీన్, సామీనాబేగం, ఈఎస్.రాజ్ జితేంద్రనాథ్, బన్నాల గీతాప్రవీణ్ముదిరాజ్, టి.మహేశ్వరి, బండారి రాజ్‌కుమార్, వనం సంగీతయాదవ్, శాంతిసాయిజెన్ శేఖర్, మహ్మద్ మాజిద్‌హుస్సేన్, సతీష్‌బాబు పండాల ఉన్నారు. వీరిలో నలుగురు ఉపసం హరించుకోవాల్సి ఉండగా.. ఎవరెవరు ఉప సంహరిం చుకుంటారు? బరిలో ఎవరెవరు ఉంటారో? 14వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.