Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్.రామ్మోహన్రావు, ఆర్.కోటం రాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్.రామ్మోహన్, ఆర్.కోటంరాజు ఎన్నికయ్యారు. మహబూబాబాద్‌లో ఇటీవల ఆ ఫెడరేషన్ రాష్ట్ర మూడో మహాసభలు జరిగిన విషయం తెలిసిందే. అందులో 65 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. కోశాధికారిగా సోమయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డి.లక్ష్మణ్, బి.శ్రీనివాసులు, వి.గాలయ్య, జి.కోటేశ్వరరావు, టి.ఉప్పలయ్య, జె.వెంకన్న, వి.సరోజ, కార్యదర్శులుగా సీహెచ్.లక్ష్మీనారాయణ, కె.చంద్రారెడ్డి, యు.నరసింహారావు, ఈ.రమేశ్, బి.సంతోశ్, ఎస్.రేణుక నియమితులయ్యారు. మరో 45 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1996 కేంద్రచట్టం, 1998 సెస్ చట్టం, 1979 వలస కార్మికుల చట్టాలను రక్షించుకుంటూ వలస కార్మికుల చట్టం పటిష్టంగా అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మహాసభలో తీర్మానించినట్టు ఎస్.రామ్మోహన్రావు, ఆర్.కోటంరాజు తెలిపారు. వెల్ఫేర్బోర్డులోని నిధులన్నీ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చుచేసేలా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్మిక మంత్రి గారి ప్రకటించిన లక్ష సైకిల్ మోటార్లను వెంటనే ఇవ్వాలనీ, అర్హులందరికీ అందేలా చూడాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణకార్మికులకు ఇవ్వాలనీ, అన్ని ప్రాంతాల్లో ఐదు లక్షల ఇండ్లు కట్టించి ఉపాధి కల్పించాలని కూడా కోరారు.