Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలను ఈనెల 18,19 తేదీల్లో హన్మకొండలో నిర్వహించనున్నారు. సంబంధిత వాల్‌పోస్టర్ గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ... మహాసభల సందర్భంగా 18న హన్మకొండలో (వేయి స్థంభాల గుడి నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకూ) భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సభను నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉద్యోగ, కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో భాస్కర్‌తోపాటు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సుధాకర్, జీహెచ్ఎమ్సీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు వాణి, నాయకులు రేణుక తదితరులు పాల్గొన్నారు.