Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని భాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుజాతి అభివృద్ధి కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారనీ, తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పుట్టిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఆర్థిక అసమానతలు పోయేవరకు టీడీపీ పనిచేస్తూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. పాలనను పేదవాడి ఇంటిముందుకు తెచ్చి, రాజకీయాలకు కొత్త అర్థం ఇచ్చిన నాయకుడు ఎన్డీఆర్ అని కొనియాడారు. స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్ధికి, హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి నాంది పలికిందని వివరించారు. కాసాని జానేశ్వర్ మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ పుట్టిందన్న విషయం మర్చి పోవద్దన్నారు. 'చంద్రబాబు అంటే క్షమశిక్షణ... క్రమశిక్షణ అంటే చంద్రబాబు' అని అన్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో అన్ని జిల్లాల యువత టీడీపీ జెండా పట్టుకు న్నారని, రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ గ్రామాన తిరుగుతానన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివద్ధి పనులే మనకు ఎజెండా అని, చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలుగుదేశం ఉంటుందని చెప్పారు. రెండు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీకి పూర్వవైభవం రావడానికి కృషిచేస్తానన్నారు. మన నాయకుడు చేసిన అభివృద్ధి పనులు చెబుతూ ముందుకు సాగుతామని వ్యాఖ్యానిం చారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు టీడీపీకి అండగా ఉన్నారని' అని కాసాని అన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట ర్యాలీగా పెద్దసంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి, టీడీపీ కార్యాలయానికి వెళ్లారు.
భారీ ర్యాలీతో చంద్ర ఓబాబు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ట్రస్ట్ భవన్‌కు ర్యాలీగానే వచ్చారు. ఈకార్య క్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అర్వింద్కుమార్గౌడ్, బక్కని నిర్సంహులు, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, రామేశ్వర్, తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.