Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురు మంత్రులు హాజరు
- స్పీకర్, మండలి చైర్మెన్ అభినందనలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. గురువారం శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజరు కుమార్‌తోపాటు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు పాల్గొన్నారు. అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును స్పీకర్ అందజేశారు. విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ నెల మూడున ఉపఎన్నికలో కూసుకుంట్ల తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించారు. ఆయనపై 10 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ కూసుకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్ల అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.