Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమ్మద్ అలీ
- పోలీస్ బెటాలియన్‌లో కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన హోంమంత్రి డీజీపీ
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్‌గా ఉన్నారని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో గల ఫస్ట్ పోలీస్ బెటాలియన్‌లో రూ.12 కోట్లతో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కన్వెన్షన్ సెంటర్‌ను హోంమంత్రి, డీజీపీ మహేందర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. మార్చి 2020లో ఈ అధునాతన కన్వెన్షన్ సెంటర్‌కు తెలంగాణ ప్రభుత్వం పునాదులు వేసిందని, కోవిడ్ సమయం అయినప్పటికీ పని ఆపకుండా పూర్తి చేసిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థపై ఎంతో ఖర్చు చేస్తున్నారని, కావలసిన అన్ని నిధులు సమకూరుస్తున్నందున, దేశంలోనే తెలంగాణ పోలీసులకు నంబర్ వన్ స్థానం దక్కిందన్నారు. కన్వెన్షన్ సెంటర్లపై, పోలీసు పెట్రోల్ పంపులపై వచ్చిన ఆదాయానికి ఇన్‌కం ట్యాక్స్ లేకుండా అనుమతి ఇచ్చారని, అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్‌కు ఆర్థిక సహాయం చేసిన దాతలకు కూడా ట్యాక్స్ రద్దు చేశారని తెలిపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొట్టమొదటి కన్వెన్షన్ సెంటర్ సిద్దిపేటలో ప్రారంభించామన్నారు. రెండో కన్వెన్షన్ సెంటర్‌ను ఎంతో విశాలవంతంగా, అధునాతన సౌకర్యా లతో యూసఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్‌లో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో పోలీసుల కుటుంబాల కోసం ఇదే విధంగా కన్వెన్షన్ సెంటర్లను ప్రారంభిం చేందుకు, పోలీస్ పెట్రోల్ బంకులు నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఈ కన్వెన్షన్ సెంటర్లు పోలీసు కుటుంబాల కోసమే కాకుండా, బయటి వారికి కూడా అద్దెకి ఇచ్చి వచ్చిన ఆదాయాన్ని పోలీసు వ్యవస్థకు వాడు కునేందుకు ఉపయోగపడతాయన్నారు. పోలీస్ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రతి పోలీస్ కుటుంబానికి సొంత గృహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నా మన్నారు. అలాగే, పోలీస్‌ల పిల్లల స్కాలర్షిప్ కోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ అంజన్‌కుమార్, టీఎస్ఎస్పి ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ ఏకే మిశ్రా, అడిషనల్ కమాండెంట్ అభిలాష్ డిష్, పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.