Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఫర్టీ9' అంటే సంతానం, సంతోషం..
- 10 ఏండ్లలో 10వేల మంది దంపతుల కల నెరవేర్చిన సెంటర్
- లేటెస్ట్ అడ్వాన్స్ ఐఏఎఫ్ ప్రొసీజర్స్‌తో వైద్య సదుపాయం
- 50శాతం రాయితీని కల్పిస్తున్న ఫ˜ర్టీ9 సెంటర్లు
పిల్లలు లేరని బాధపడుతున్నారా.. ఇక పిల్లలు పుట్టరని చింతిస్తున్నారా.. పెండ్లీలకు, శుభకార్యాలకు వెళ్తుంటే పిల్లలు లేరని చిన్నచూపు చూస్తున్నారా.. పెండ్లయి ఏండ్లు గడుస్తున్నా ఇక పిల్లలు పుట్టబోరని గేలిచేస్తున్నారా.. అలాంటి వారికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది సికింద్రాబాద్‌లోని ఫర్టీ9 సెంటర్. పిల్లలు లేనివారికి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ప్రొజర్స్తో తగిన చికిత్స అందిస్తున్నారు. అనుభవం కలిగిన వైద్యులు, గైనకాలజిస్ట్లు ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రముఖ డాక్టర్, గైనకాలజిస్ట్ డాక్టర్ సి.జ్యోతి వైద్యవృత్తిలో 25ఏండ్ల అనుభవంతో మెరుగైన సేవలను అందిస్తున్నారు. దేశవిదేశాల్లో వారు పేరు ప్రతిష్టలను సంపాదించారు. పిల్లల కోసం దేశ విదేశాల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేని దంపతులు ఫ˜ర్టీ9ను ఆశ్రయిస్తున్నారు. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 10ఏండ్ల కాలంలో దాదాపు 10వేల మంది దంపతులకు సంతానసాఫల్యం కల్పిం చారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) నిబంధన లను పాటిస్తూ ఎన్నో విజయా లను సొంతం చేసుకున్నారు.
నవతెలంగాణ- సిటీబ్యూరో
మాతృత్వం దేవుడిచ్చిన వరమని, డాక్టర్లంటే ప్రత్యక్ష దైవమని ప్రముఖ సినీ నటి ఆమని తెలిపారు. పిల్లలు లేకుంటే మహిళలకు ఎంతో బాధ వుంటుం దన్నారు. సికింద్రాబాద్‌లోని ఎన్సీఎల్ బిల్డింగ్‌లోని ఫర్టీ9 సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్య క్రమంలో లేటెస్ట్ అడ్వాన్స్ ఐవీఎఫ్ ప్రొసీజర్స్ ఫర్టీ9 లోగోను నటి ఆమని ఆవిష్క రించారు. అనంతరం మాట్లా డుతూ.. పిల్లలంటేనే మమ కారం, ప్రేమ అంటూ వర్ణించారు. సంతాన లేమితో బాధపడుతున్న వారికి సరికొత్త పరిజ్ఞానంతో వైద్యం అందిస్తున్న ఫ˜ర్టీ9ను ప్రత్యేకంగా అభినం దించారు. 'ఫర్టీ9' ఫెటిలిటీ సెంటర్ విజయవంతంగా 10ఏండ్లు పూర్తిచేసు కున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరింత అభివృద్ధి, సక్సెస్ రేట్‌ను సాధించాలని ఆకాంక్షించారు. మాతృత్వం మహిళలకు ఒక వరం లాంటిదని, ఏ స్త్రీకైనా గొప్ప ఆనందం అని అన్నారు. సంతాన సాఫల్యత చికిత్సారంగంలో అత్యాధునిక సాంకేతిక తతో కూడిన చికిత్స విధానాలను అందించడంలో ఫర్టీ9 అగ్రగామిగా నిలిచిందన్నారు. లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ప్రొజర్స్తో పిల్లలు లేనివారికి తగిన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. నవంబర్ నుంచి డిసెంబర్ 31వరకు అన్ని బ్రాంచ్‌లలో మహిళలకు 50శాతం రాయితీని కల్పిస్తున్నట్టు తెలిపారు. సంతానలేమిపై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందన్నారు. అనంతరం డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ.. 'ఫర్టీ9 అంటే సంతానం, సంతోషమే అన్నారు. అత్యుత్తమ, అగ్రశ్రేణి ఫర్టిలిటీ క్లీనిక్ ఫర్టీ9 వార్సికోత్సవ వేడుకల సందర్భంగా అధునాత నమైన లేటెస్ట్ అడ్వాన్స్ ఐవీఎఫ్ చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. సంతాన సాఫల్యత రంగంలోనే వినూత్నమైన ఈఐవీఎఫ్పై 50శాతం రాయితీని మహిళలు సద్వినియోగం చేసుకోవా లన్నారు. పిల్లల కోసం పరి తపిస్తున్న ఎంతో మంది దంపతులకు దాదాపు ఒకటిన్నర దశాబ్దం నుంచి అందుబాటు ధర ల్లోనే అత్యు న్నత ప్రమాణా లతో చికిత్స అంది స్తున్నామని తెలిపారు. 30మంది ప్రముఖ వైద్యులు, సిబ్బంది, ఇతర టెక్నీషియన్స్‌తో టీం వర్క్‌చేస్తూ సక్సెస్‌ను సాధిస్తున్నామని తెలిపారు. తనదైన ముద్ర వేసుకున్న 'ఫర్టీ9' ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంటూ తనకు తానే సాటి అని నిరూపించుకుందన్నారు.
ఐదేండ్లు నరకం అనుభవించాం
సూటుపోటి మాటలను భరించలేకపోయాం. ఐదేండ్లు బంధుమిత్రుల ఇండ్లల్లో శుభకార్యాలకు వెళ్లలేకపోయేవాళ్లం. నలుగురిలో తల ఎత్తుకోలేక నేనూ మా ఆయన తీవ్ర మానసికక్షోభ అనుభవించాం. పిల్లల కోసం తిరగని ఆస్పత్రి లేదు. చెప్పిన కాడికల్లా ఉరికాం. ఈ జీవితం ఎందుకని మదనపడ్డాం. చివరకు ఓ స్నేహితుని సూచన మేరకు ఫర్టి9 ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాం. జీవితంలో పిల్లలు పుట్టరని అనుకున్న మాకు బాబు పుట్టాడు. జ్యోతి మేడంను ఎన్నటికీ మర్చిపోలేం.
- మానస, మహబూబ్‌నగర్.
పెండ్లయి 16ఏండ్లు దాటాయి
మాకు పెండ్లయి 16ఏండ్లు దాటింది. పిల్లలు లేరని ఇరుగుపొరుగు, బంధుమిత్రులు హేళన చేసేవారు. ఎంతో క్షోభను అనుభవించాం. మా స్నేహితుల ద్వారా ఫర్టీ9 గురించి తెలుసుకుని డాక్టర్ సి.జ్యోతిని సంప్రదించాం. ఆమె సలహాలు సూచనలు పాటించాం. మాకు కవలపిల్లలు పుట్టారు. వారితో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
- ఇందిర, సూరారం