Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీకి ఐద్వా వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గద్వాలలో మహిళలు, యువతుల న్యూడ్ ఫొటోలు, వీడియోలకు సంబంధించి ఇటీవల ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మితో పాటు ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత, సభ్యులు ఎ.నర్మద శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. వారంలోగా సంబంధిత వ్యక్తులను పట్టుకుంటామనీ, ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా సమగ్ర విచారణ జరిపి, వారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్టు వారు ఒక ప్రకటనలో తెలిపారు.గద్వాల లో ఉద్యోగ కల్పన కోసం నిర్వహించిన స్టడీ సర్కిల్ వేదికగా మహిళలను ట్రాప్ చేశారని ఐద్వా నేతలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ దుశ్చర్యలో టౌన్ ఎస్ఐ,సీఐల పాత్రతో పాటు,అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖుల పాత్ర ఉన్నట్టుగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్న ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దోషులను అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు.