Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.08కోట్ల నగదు స్వాధీనం
- పదేండ్లలో కోట్లలో అక్రమ ఎగుమతులకు పాల్పడ్డారని అధికారులు ఆధారాల సేకరణ
- చైనా నుంచి గ్రానైట్ కంపెనీల సిబ్బంది ఖాతాల్లోకి డబ్బు జమ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గత రెండు రోజులుగా రాష్ట్రంలోని కొన్ని గ్రానేట్ కంపెనీల పై దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు రూ. 1.08 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక గత పదేండ్లలో సదరు కంపెనీలు ప్రభుత్వానికి భారీ మోత్తంలో రాయల్టీలను ఎగ్గొడుతూ కోట్లాది రూపాయల విలువైన గ్రైనైట్ రా మెటేరియల్స్ను చైనా హాంకాంగ్‌లకు ఎగుమతి చేసినట్టుగా కూడా ఈడీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. ఈ మేరుకు గత రెండు రోజులుగా హైదరాబాద్ , కరీంనగర్‌లలో శ్వేత్వా గ్రానెట్స్ శ్వేతా ఏజెన్సీ, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్, అరవింద్ గ్రైనెట్స్, పీఎస్ఆర్ గ్రానెట్స్ ఏజెన్సీ లలో ముమ్మరంగా సోదాలను నిర్వహించినట్టు ఈడీ అధికారులు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను పక్కన బెట్టి అంతకు మించి గ్రైనెట్స్ ఎగుమతులకు సదరు కంపెనీలు పాల్పడినట్టు ఈడీ దృష్టికి వచ్చింది. గతంలో ఈ కంపెనీలపై రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ జరిపిన విచారణ ను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు తదుపరి దర్యాప్తును చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ , హైదరాబాద్‌ల నుంచి చైనా, హాకాంగ్లకు సముద్ర మార్గం ద్వారా గ్రైనైట్లను ఎగుమతి చేసే వారని ఇందుకు అనేక అక్రమ మార్గాలను కూడా ఈ సంస్థలు అనుసరించాయని ఈడీ తెలిపింది. కరీంనగర్ నుంచి విశాఖ, మచిలీపట్నంలకు గ్రానైట్లను తీసుకెళ్లి అక్కడి నుంచి పడవలపై విదేశాలకు తరలించే వారని తేల్చింది. ముఖ్యంగా పనామా లింక్ కుంభకోణంలో నిందితుడైన హువన్యూ ద్వారానే వీరి అక్రమ ఎగుమతులు సాగేవని తెలిపింది. అతని ద్వారానే హవాలా ద్వారా కోట్ల రూపాయల డబ్బులు ఈ సంస్థలకు చేరేవని వివరించింది.
ముఖ్యంగా ఈ డబ్బులు తమ సంస్థలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లోకి చేరేలా కంపెనీల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకునేవని తమ విచారణలో వెల్డఐనట్టు ఈడీ వివరించింది. దీని ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల రాయల్టీని ఈ కంపెనీలు ఎగవేసినట్టు బయటపడిందని తెలిపారు. సోదాల్లో పై కంపెనీల కార్యాలయాల నుంచి గత పది సంవ్సతరాలకు సంబంధించిన ఎగుమతి , దిగుమతులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వాటిని సునిశితంగా పరిశీలించి దర్యాప్తు సాగిస్తున్నామని ఈడీ వెల్లడించింది.