Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణకుమార్ జైన్
- ఆలిండియా ఆర్పీఎఫ్ బ్యాండ్ పోటీలో దక్షిణ మధ్య రైల్వే విజయం
- బహుమతులను అందజేసిన జీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విభిన్న సంస్కృతులకు ఆలవాలమైన మన దేశంలో సంగీతం ఒక బంధన శక్తిగా పనిచేస్తుందనీ, శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంచడంలో అది కీలక పాత్ర పోషిస్తున్నదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో 11వ ఆలిండియా ఆర్పీఎఫ్ బ్యాండ్ పోటీల ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ రాజారామ్, సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ బ్యాండ్ కాంపిటీషన్ అనేది కేవలం ఎవరు బెస్ట్ అని నిర్ణయించే కార్యక్రమం కాదనీ, ఇది ఐక్యత, సమన్వయ ప్రదర్శన అన్నారు. దేశ నిర్మాణం వైపు ఆత్మీయ కవాతు అని చెప్పారు. విజేతలను అభినందించారు. వివిధ జోన్ల నుంచి మొత్తం 14 బృందాలు, 227 మంది బ్యాండ్ సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు.
టీమ్ విజేతలు వీరే...
విజేత : దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యాండ్ టీమ్
రన్నరప్: రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్
మూడో స్థానం: తూర్పు రైల్వే.
వ్యక్తిగత విభాగంలో..
మొదటి స్థానం : ఎమ్పీ మండల్, హెడ్ కానిస్టేబుల్, తూర్పు రైల్వే.
ద్వితీయ స్థానం : కేబీ గురుంగ్, హెడ్ కానిస్టేబుల్, నార్త్ ఈస్టర్న్ రైల్వే
మూడో స్థానం : జీత్ రామ్, హెడ్ కానిస్టేబుల్, నార్తర్న్ రైల్వే